సంవ‌త్స‌ర జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

 ఢిల్లీ: ప్ర‌ముఖ నిర్మాత ఏక్తాక‌పూర్ త‌న సంవ‌త్స‌ర జీతాన్ని వదులుకున్నారు. సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయిన బాలాజీ టెలిఫిల్మ్స్లో ప‌నిచేస్తున్న త‌న స‌హోద్యోగులకు స‌హాయం చేయ‌డానికి సంవ‌త్స‌రం జీతం రూ. 2.5 కోట్లు వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు "ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో బాలాజీ టెలిఫిల్మ్స్‌లో పనిచేసే వివిధ ఫ్రీలాన్సర్లు, రోజువారీ వేతన కార్మికులను చూసుకోవ‌డం నా ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా భావిస్తున్నాను. వరదలు, ఉగ్రవాద దాడులు, బ్యాంక్ సెలవుదినాల్లో కూడా వీళ్లు ప‌నిచేశారు.మా కార్యాల‌యాన్ని మూసివేయడం ఇదే మొద‌టిసారి. ఈ క‌ష్ట‌కాలంలో వాళ్ల‌ను ఆదుకోవ‌డం చాలా ముఖ్యం. అందుకే నా వంతు సాయంగా ఇది చేస్తున్నాను. ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్యత గ‌ల పౌరులుగా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించండి. ఆరోగ్యంగా ఉండండి". అంటూ పేర్కొన్నారు.