న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్ కానున్న ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.
హాట్ ఇంటీరియర్స్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా..